ETV Bharat / state

Double bedroom houses: రెండు పడక గదుల ఇళ్ల తాళాలు పగలగొట్టిన లబ్ధిదారులు.. ఎందుకంటే..

రెండు పడకగదుల(Double bedroom houses) మంజూరు ఆలస్యం కావడంతో లబ్ధిదారులు ఆగ్రహించారు. నిర్మించిన ఇళ్లను సకాలంలో పంపిణీ చేయకపోవడంతో తాళాలు పగలగొట్టి వారే ఇళ్లలోకి చేరారు. పలువురు వంటలు సైతం తయారు చేసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది.

Double bedroom houses
Double bedroom houses
author img

By

Published : Nov 18, 2021, 12:35 PM IST

మహబూబాబాద్‌ జిల్లాలో రెండు పడకగదుల(double bedroom houses) తాళాలు పగలగొట్టి లబ్ధిదారులు ప్రవేశించారు. ఇళ్ల పంపిణీ ఆలస్యం కావడంతో ఇళ్లలోకి చేరారు. కురవి మండలం మొగిలిచర్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణం పూర్తయినా.. పంపిణీ చేయడం లేదని వారు ఆరోపించారు. వర్షాలతో(rains in telangana) గుడిసెల్లో ఇబ్బంది పడలేక ఇళ్ల ముందు పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి లోపలికి ప్రవేశించామని తెలిపారు.

2018లో రూ.2 కోట్లతో 38 ఇళ్లను నిర్మించారు. ఏడాది క్రితం పనులు పూర్తయ్యాయి. లబ్ధిదారులను(double bedroom beneficiaries) ప్రాథమికంగా గుర్తించినా వారికి అప్పగించలేదు. వాటిని ప్రారంభించలేదు. ఈ క్రమంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నానా అవస్థలు పడుతున్నామని 13 కుటుంబాలు కొత్త ఇళ్లలోకి ప్రవేశించారు. పలువురు వంటలు కూడా చేసుకున్నారు.

తప్పని పరిస్థితుల్లో ఇళ్లలోకి చేరినట్లు తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బంది వచ్చి మళ్లీ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారని వారు వాపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా గ్రామ సభ ఏర్పాటు చేయలేదని మొగిలిచర్ల గ్రామ సర్పంచ్ అనిత తెలిపారు. అక్రమంగా ఇళ్లలోకి ప్రవేశించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Child marriages in Telangana : షాదీముబారక్​ నగదు కోసం.. పథకం ప్రకారం పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.