మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట మండలం పడమటి గూడెంలోని బాలాజీ కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభించారు. ఆయనే స్వయంగా పత్తిని విక్రయించి వేలిముద్రలు వేశారు. ఆరుగాలం శ్రమించి.. సాగు చేసిన పత్తి రైతులు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు.
రైతుల మేలు కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐ ద్వారా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారన్నారు. సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పత్తిని విక్రయించి లబ్ధి పొందాలన్నారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అనంతరం మరిపెడలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన పారిశుద్ధ్య ట్రాక్టర్లను రెడ్యా నాయక్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: పొదుపు సంఘాల భవనాల్లో సినీ ఫక్కీ తరహాలో చోరీ