ETV Bharat / state

అలా చేస్తే జైలుకు పంపుతాం: మంత్రి శ్రీనివాస్​గౌడ్​ - మహబూబ్​నగర్​ వార్తలు

సంక్షేమ ఫలితాలు పేదలకు అందేలా చూసేందుకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని మంత్రి శ్రీనివాస్​గౌడ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో విద్యార్థుల భోజనం, విద్యపై సంక్షేమ శాఖ అధికారులు దృష్టిసారించాలన్నారు. అస్పృశ్యత లేకుండా చూడాలని.. ఎక్కడైనా పాటించనట్లయితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

Doing so will send you to jail: Minister Srinivas Goud
అలా చేస్తే జైలుకు పంపుతాం: మంత్రి శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : Jun 23, 2020, 6:08 AM IST

సంక్షేమ ఫలితాలు పేదలకు అందేలా చూసేందుకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ అన్నారు. మహబూబ్​నగర్​లోని రెవెన్యూ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలుపై దాడులు, అత్యాచారాలపై ఏర్పాటైన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అస్పృశ్యత లేకుండా చూడాలని.. ఎక్కడైనా పాటించనట్లయితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో విద్యార్థుల భోజనం, విద్యపై సంక్షేమ శాఖ అధికారులు దృష్టిసారించాలన్నారు. జిల్లాలో పెండింగ్​లో ఉన్న 20 కేసులను నెలలోపు పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మహబూబ్​నగర్​లో నిర్వహించేందుకు ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.

కమిషన్ ద్వారా 2019 నాటికి ఎస్టీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో బాధితులకు రూ.43 కోట్లు పరిహారాన్ని ఇచ్చామని ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ ఛైర్మన్​ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. కేసుల పరిష్కారంలో బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీపై ఉందని గుర్తుచేశారు. 90 రోజుల్లో కేసులు పరిష్కరించాలని, ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా నుంచి తమకు 108 ఫిర్యాదులు వచ్చాయని.. వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు.

హరితహారం సన్నాహక సమావేశం..

అటవీ శాఖ ఆధ్వర్యంలో హరితహారం సన్నాహక సమావేశానికీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ ఏడాది లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లోని చెరువు గట్లపైన తాటి మరియు ఈత మొక్కలు తప్పనిసరిగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

చెక్ డ్యాంలు, కాలువల వెంట మొక్కలు నాటాలని, జడ్చర్ల-మహబూబ్​నగర్, భూత్పూర్-మహబూబ్​నగర్ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రహదారుల మధ్యలో సెంట్రల్ డివైడర్లలో ఎవర్​గ్రీన్ మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కల్లో 10 శాతం కూడా ఎండిపోవడానికి వీలులేదని తేల్చిచెప్పారు. పండ్ల మొక్కలు, మంకీ ఫుడ్ పండ్ల చెట్లనూ పెంచాలని, గ్రామాల్లో ఉన్న నర్సరీలకు బోర్డులు, ఫెన్సింగ్ , కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల ఆవరణలో, జంక్షన్ దగ్గర మొక్కలు నాటాలని, అన్ని సర్కారు స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. ఒకేరోజు జిల్లావ్యాప్తంగా 20 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండీ : 'లక్షలోపు రుణాలు షరతులు లేకుండా ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.