కొత్త సంవత్సరం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ గుడి కేంద్రంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పలు కాలనీలలో ప్రజలు డీజే పాటలకు స్త్రీ, పురుషులు, చిన్నా, పెద్దా తేడా లేకుండా నృత్యాలు చేశారు.
2019 ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా గడిచిపోయిందని, ప్రజలంతా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూశారని ఎస్పీ అన్నారు. 2020లో కూడా అదే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేష్ కుమార్, సీఐలు, ఎస్ఐలు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఇవాళ్టి నుంచి భాగ్యనగరంలో నుమాయిష్ జోష్