మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న 15 మందికి 6 లక్షల 60 వేల రూపాయలను అందజేశారు. హుజూర్నగర్లో తెరాస గెలుపు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. గ్రామాలు, మండల కేంద్రాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులను కేటాయించడం ఎంతో శుభపరిణామమని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాసా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చూడండి : దీపావళి సంబురాల్లో ప్రమాదం... ఏడుగురి పరిస్థితి విషమం