ETV Bharat / state

మొదటి ధరణి స్లాట్​ బుకింగ్​... రశీదు అందజేసిన కలెక్టర్ గౌతమ్​​ - మహబూబాబాద్​లో ధరణి స్లాట్​ బుకింగ్​

భూ క్రయవిక్రయాలు, పంపకాలు, ఆస్తుల వివరాలు మార్చుకునేందుకు ధరణి పోర్టల్​ను వినియోగించుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. మొదటగా స్లాట్​బుక్​ చేసుకున్న వారికి రశీదును స్వయంగా అందజేశారు.

మొదటి ధరణి స్లాట్​ బుకింగ్​... రశీదు అందజేసిన కలెక్టర్ గౌతమ్​​

author img

By

Published : Nov 1, 2020, 9:42 AM IST

ధరణి స్లాట్​ ప్రక్రియ ద్వారా భూమిపై హక్కు లభిస్తుందని, భద్రతతో పాటు విక్రయించుకునేందుకు అర్హులు అవుతారని మహబూబాబాద్​ కలెక్టర్​ గౌతమ్​ తెలిపారు. ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా హంకీ... భర్త బుంగ మృతి చెందడం వల్ల అతని పేరు మీద ఉన్న ఆస్తిని భార్య పేరుపై మార్పు చేసేందుకు ధరణి పోర్టల్​లో స్లాట్ బుక్ చేసుకున్నారు.

మొట్టమొదటి బుకింగ్ స్లాట్​​ రశీదును కలెక్టర్​ గౌతమ్ స్వయంగా సదరు దరఖాస్తుదారురాలికి అందజేశారు.​
ప్రతి ఒక్కరూ ధరణి పోర్టల్ ద్వారా తమ ఆస్తులు వివరాలను స్లాట్ల​లో నమోదు చేసుకోవచ్చని, కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్లు మీసేవ కేంద్రానికి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ గౌతమ్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రంజిత్ కుమార్, ఆర్ఐ ప్రవీణ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: భూముల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ల బుకింగ్ విధానం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.