మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటూ.. డిమాండ్ చేశారు.
ఒకే నెలలో అనేకసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం వేయడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దస్రూ నాయక్ అన్నారు. కరోనా సాయంగా ప్రభుత్వం ఇచ్చిన రూ.1500 పెంచిన ధరలకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు ఈ స్థాయిలో పెంచలేదని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించకపోతే.. ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీచూడండి: నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం