తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేటు విద్యా సంస్థ… విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా… పీడీఎస్యూ విద్యార్థి సంఘం అడ్డుకుని జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేసింది.
ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హొలీ ఏంజెల్స్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం 7, 8, 9 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లలను.. ఫీజును తీసుకొని పాఠశాలకు రండి… వార్షిక పరీక్షలు నిర్వహించి పైతరగతులకు ప్రమోట్ చేస్తాం అని సమాచారం అందించారు. కొంత మంది పిల్లలు పాఠశాలకు వచ్చి తరగతి గదులలో పరీక్షలు రాస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పీడీఎస్యూ విద్యార్థి సంఘం పాఠశాలకు చేరుకొని పరీక్షలను అడ్డుకుని విద్యార్థులను బయటకు పంపించింది. జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర్ శర్మకు సమాచారం అందించారు. డీఈఓ పాఠశాలకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థుల నుంచి పరీక్ష పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.
- ఇదీ చదవండి : ఉన్నత పీఠంపై ఊరు బిడ్డ.. పులకరించిన పురిటి గడ్డ