మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాలార్ తండా సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆకస్మికంగా సందర్శించారు. అధికారులతో మాట్లాడి పలు వివరాలను తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలను వేశారు.
ఇదీ చదవండి: చైనాకు 'కరోనా' కష్టాలు- రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం