మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారత్ బంద్ సంపూర్ణంగా... స్వచ్ఛందంగా కొనసాగుతోంది. పట్టణంలోని 365 జాతీయ రహదారిపై తెరాస శ్రేణులు, వామపక్షాలు రాస్తారోకో నిర్వహించారు. వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులను స్వచ్ఛందంగా మూసివేశారు. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు.
తొర్రూరు బంద్ సంపూర్ణం
తొర్రూర్లో భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు లభించింది. ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్షాలు, తెరాస శ్రేణులు పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపాయి.
![bharat bandh peacefully conducted in mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9803671_mhbd.png)
ఇదీ చదవండి: ఒలింపిక్స్లో బ్రేక్ డ్యాన్సింగ్కు చోటు