ETV Bharat / state

కేసీఆర్​ ప్రభుత్వం... పేదల ప్రభుత్వం​: ఎంపీ కవిత - మహబూబాబాద్​లో సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కుల పంపిణీ

కేసీఆర్​ ప్రభుత్వం పేదల సర్కారని మహబూబాబాద్​ ఎంపీ మాలోతు కవిత తెలిపారు. 21మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

cm relief fund cheques distributed by mp kavitha in mahabubabad
కేసీఆర్​ ప్రభుత్వం... పేదల ప్రభుత్వం​: ఎంపీ కవిత
author img

By

Published : Oct 17, 2020, 9:50 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 21మందికి సీఎం రిలీఫ్​ ఫండ్​ కింద మంజూరైన 8 లక్షల 42 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆమె అందించారు.

కేసీఆర్ ప్రభుత్వం పేదల సర్కారని ప్రతి పేదవారిని ఆదుకోవడానికే ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రజలందరూ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.

ఇదీ చూడండి: కిట్​లో రూ.2,800 విలువ చేసే నిత్యావ‌స‌రాలు, 3 దుప్పట్లు: కేటీఆర్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.