మహబూబాబాద్ జిల్లా టౌన్ సీఐ రవికుమార్, రూరల్ సీఐ వెంకటరత్నం పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు రూపొందించి.. డబ్బులు కావాలని పలువురికి సందేశాలు పంపించారు సైబర్ నేరస్థులు. అత్యవసరంగా రూ. 10 వేలు, రూ. 15 వేలు కావాలని కోరారు. ఆ డబ్బును గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పంపించాలని విన్నవించారు. కాకపోతే ఆ సందేశాలకు ఎవరూ స్పందించలేదు.
అయితే ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు అదంతా అబద్ధమని స్పష్టం చేశారు. ఎవరైనా అలా అడిగితే డబ్బులు పంపొద్దని సూచించారు. ఈ సందేశాలు పంపింది ఎవరో తెలుసుకునేందుకు సైబర్ నిపుణుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
ఇదీ చదవండి: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్టు