ETV Bharat / state

ఎండిపోయిన నిండుకుండ - CHERUVU

వానాకాలం వచ్చి నెల దాటిపోయినా వర్షం పడట్లేదు. ఎప్పుడెప్పుడు చినుకులు కురుస్తాయా అని అన్నదాతలు ఆకాశం వైపు చూస్తూనే ఉన్నారు. అయినా వరుణుడు కరుణించట్లేదు. ప్రతి ఏటా ఈ సమయానికల్లా జలకళతో రమణీయంగా కనిపించే చెరువులన్నీ వెలవెలబోయాయి.

ఎండిపోయిన నిండుకుండ
author img

By

Published : Jul 21, 2019, 12:23 PM IST

ఎండిపోయిన నిండుకుండ

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని బయ్యారం చెరువు జిల్లాలోనే అతి పెద్ద చెరువు. దీని సామర్థ్యం 0.4 టీఎంసీలు. 16.5 ఫీట్లకు నీరు చేరుకుంటే చాలు అలుగు పొంగేది. రాష్ట్రంలోనే మొట్టమొదటగా పొంగే చెరువు ఇదే కావడం గమనార్హం. చుట్టూ కొండలు... మధ్యలో జలకళతో ప్రకృతి రమణీయంగా కనిపించే ఈ చెరువు ప్రస్తుతం నీరు లేక మైదానంగా మారి పోయింది. ఈ పరిస్థితి చూసి వేలాది మంది ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

చెరువులో క్రికెట్ ఆడుకుంటున్న యువకులు

ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ చెరువు కింద సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువు పక్కనే ఉన్నా వరుణుడు కరుణించక ఇప్పటి వరకు వరి నారు కూడా పోసుకోలేకపోయామని, కనీసం ప్రత్యామ్నాయ పంటలు వేసుకుందామన్నా భూమి దున్నే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ నిండుకుండలా ఉంటూ... తమ పంటలకు నీరందించే బయ్యారం చెరువు ప్రస్తుతం విద్యార్థులు క్రికెట్ ఆడుకునేందుకు మాత్రమే పనికొస్తుందని రైతులు వాపోతున్నారు.

పెరిగిపోతున్న పూడిక

గతంలో బయ్యారం చెరువు ఒక్కసారి అలుగు పోస్తే రెండు పంటలు పండేవి. నేడు రెండుసార్లు అలుగు పోసినా ఒక్క పంట కూడా పండే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువంతా పూడికతో నిండిపోయినా మరమ్మతులు చేయించలేదు. కనీసం ప్రైవేటు పరిశ్రమల వారు మట్టిని తవ్వి తీసుకెళ్దామన్నా... అధికారులు ఆంక్షలు విధించడం వల్ల అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వీటి వల్ల చెరువు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.

నీటి సమస్య ఉన్నప్పుడు.. సీతారామ ప్రాజెక్టు ద్వారా బయ్యారం చెరువుకు నీటిని అందించి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుగా చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఇంటిపై కప్పు కూలి బాలుడు మృతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.