దంతాలపల్లికి చెందిన నర్కుటి సాగర్.. భార్య పద్మను కాన్పు కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో రాగా.. రాత్రి 7:30కి కాన్పు జరిగింది. ప్రసవం జరిగిన సమయానికి వైద్యులు అందుబాటులో లేరు. స్టాఫ్ నర్సే ప్రసవం చేసింది. శిశువు అడ్డం తిరిగి కాన్పు కష్టమైంది. మొదట కాళ్లు బైటికి వచ్చి తల భాగం తీయటంలో సమస్య ఎదురైంది. వెంటనే మరో స్టాఫ్‌నర్స్‌కు సమాచారం అందించగా వచ్చి కాన్పు పూర్తి చేసింది. అయితే ఫలితం దక్కలేదు. ప్రసవం పూర్తయ్యాక బిడ్డ కడుపులోనే మృతి చెందిందని ఆమె బాధితులతో చెప్పారు. వైద్యుడు సతీష్ కుమార్‌ను వివరణ కోరగా.. వారం క్రితమే శిశువు కదలికలు సరిగ్గా లేనందున శస్త్రచికిత్స చేయించుకోవాలని వారికి సూచించినట్లు తెలిపారు. అనారోగ్యం కారణంగానే కడుపులో శిశువు మృతి చెందిందని చెప్పుకొచ్చారు. బాధితులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమకు బిడ్డ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాన్పు సమస్య ఉందని చెబితే మరో ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లమని వాపోయారు.
ఇవీ చూడండి: కేసీఆర్ సారూ.. మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోండి..