మహబూబాబాద్‌లోని బాబునాయక్ తండా సమీపంలో అసైన్డ్ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చేందుకు వెళ్లిన అధికారులపై స్థానికులు దాడి చేశారు. పోలీసు రక్షణలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు రెండవ రోజు కూల్చివేసేందుకు వెళ్ళగా వారిని స్థానికులు అడ్డుకున్నారు. అధికారుల వాహనాలపై రాళ్ల దాడి చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. మున్సిపల్ కమిషనర్ వాహనం అద్దం పగిలింది. ఈక్రమంలో తోపులాట చోటుచేసుకుంది. తహసీల్దార్ రంజిత్, మున్సిపల్ కమిషనర్లను స్థానికులు చుట్టుముట్టి దాడికి ప్రయత్నించారు. పరిస్థితి విషమించడం వల్ల అధికారులు పరుగులు తీశారు. ఓ మహిళ స్ఫృహ కోల్పోవడం వల్ల పోలీసు వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇళ్లకు ఇంటి నంబర్లు సైతం మంజూరు చేసి ఇప్పుడు ఎలా కూలుస్తారని మున్సిపల్ కమిషనర్‌ను బాధితులు నిలదీశారు.
అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు వెళ్తే.. రాళ్లతో దాడి - undefined
07:28 February 12
అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు వెళ్తే.. రాళ్లతో దాడి