మహబూబాబాద్ జిల్లా మరిపెడలో దారుణం చోటు చేసుకుంది. మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో తన భార్యకు అబార్షన్ చేయించాలనుకున్నాడో భర్త. మరిపెడ శివారులోని ఓ తండాకు చెందిన దంపతులకు ఇది వరకే ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు ఐదు నెలల గర్భవతి. మళ్లీ ఆడపిల్లే పుడుతుందని భావించిన భర్త స్థానిక ఆర్ఎంపీని సంప్రదించాడు. భార్యకు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు.
స్థానిక ఆర్ఎంపీ అప్పటికే ఆమెకు గర్భస్త్రావానికి సంబంధించిన మందులు ఇచ్చాడు. ఇంతలో విషయం తెలుసుకున్న జిల్లా వైద్య సిబ్బంది పోలీసుల సహాయంతో అక్కడికి చేరుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.5 వేలు తీసుకుని అబార్షన్ చేయబోయినట్టు ఆర్ఎంపీ ఒప్పుకున్నాడు. ఆర్ఎంపీ వైద్యుడితోపాటు మహిళ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: 'మహీ.. మరిన్ని విజయాలతో సాగిపో...'