కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు వస్త్ర మాస్కులు ధరిస్తున్నారు. మరికొందరు ఎక్కువ ధర, విలువైనవి ధరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి శివారులోని పెద్ద చెరువు వద్దకు వచ్చిన వేములపల్లి యువకుడు ఒకరు మోదుగ ఆకుతో కూడిన మాస్కును తయారు చేసి ఇలా ధరించారు. అక్కడి వారంతా ఆయనను ఆసక్తిగా చూస్తూ ఆకు మాస్కు అదిరిందంటూ కితాబిచ్చారు.
పర్యావరణహిత మాస్కుతో ఆకట్టుకున్న యువకుడు - mahaboobabad news
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే మాస్కులు ధరించటం అనివార్యమైన ఈ రోజుల్లో... వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే క్రమంలో ప్రజలు వివిధ రకాల మాస్కులు ధరిస్తున్నారు. ఓ వ్యక్తి ఏకంగా ఆకుతో చేసిన మాస్కు ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
a young man wore a leaf mask in mahabubabad district