ETV Bharat / state

ఎద్దును చుట్టేసిన భారీ కొండచిలువ.. చంపేసిన రైతు - man kills massive python

మహబూబాబాద్‌ జిల్లా పడమటిగూడెం శివారు బస్తారాం తండాలో భారీ కొండచిలువ హతమైంది. ఎద్దు కాలును చుట్టేయడం వల్ల రైతు దానిని గుర్తించి వెంటనే చంపేశాడు.

a python killed by man in mahabubabad district
భారీ కొండచిలువ మహబూబాబాద్​ జిల్లా భారీ కొండచిలువ.. హతమార్చిన రైతుహతం
author img

By

Published : Aug 30, 2020, 9:44 PM IST

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం శివారు బస్తారాం తండాకు చెందిన సురేశ్​ అనే రైతు తన వ్యవసాయ భూమిలో పశువులను మేపుతున్నారు. ఈ క్రమంలో పది అడుగుల పొడవైన భారీ కొండచిలువ ఓ ఎద్దు కాలును చుట్టేసింది. దీంతో పశువులు ఒక్కసారిగా పరుగుతీశాయి. గుర్తించిన రైతు కర్రతో కొట్టి దాన్ని హతమార్చాడు. ఇంత పెద్ద కొండచిలువను తామెప్పుడు చూడలేదని తండావాసులు అన్నారు.

ఇవీచూడండి: జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో రాష్ట్రానికి రెండు అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.