మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి శివారులో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై ప్రసాదరావు, ఏఎస్సై చందర్, కానిస్టేబుల్ నరేష్‌లను చూసి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా... పట్టుకొని అరెస్టు చేశారు.
వారి నుంచి డీసీఎం వ్యాన్, 3 లక్షల విలువైన నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. అనంతరం ఎస్సై ప్రసాదరావు, ఏఎస్సై చందర్, కానిస్టేబుల్ నరేష్‌లకు ఎస్పీ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో ఐదుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు