కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు పాల్గొన్నారు. పలు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేశారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కోనేరు కృష్ణారావు తెలిపారు.
ట్రాక్టర్లను ఉపయోగించుకుని గ్రామాల్లో చెత్తాచెదారం తొలగించాలని.. పల్లెను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!