కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్గా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఛైర్పర్సన్గా లక్ష్మి విజయం సాధించారు. జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలుండగా తెరాస 14చోట్ల గెలుపొందింది. లింగాపూర్ కాంగ్రెస్ జడ్పీటీసీ తెరాసలో చేరడంతో 15 స్థానాలతో ఏకగ్రీవంగా జడ్పీ స్థానాన్ని ఎన్నుకున్నారు.
