ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు... ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలతో కలిసి ఆసిఫాబాద్లో యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
జిల్లా కేంద్రంలో 20 గుంటల భూమిని ప్రభుత్వం యాదవ సంఘం భవనానికి కేటాయించింది. ఎమ్మెల్సీ గ్రాంటు 10 లక్షలు, జడ్పీ ఛైర్ పర్సన్ గ్రాంటు నుంచి 20 లక్షలు, ఎమ్మెల్యే గ్రాంటు నుంచి 20 లక్షల రూపాయలతో భవన నిర్మాణం చేపట్టనున్నారు.
కేసీఆర్ సర్కార్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.
- ఇదీ చూడండి : పాఠశాలల్లో నీటి గంట.. ఫలితమిచ్చేనట