కరోనా కష్టకాలంలో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై పూలు చల్లి శాలువతో సత్కరించారు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని జాగృతి మహిళా మండలి సభ్యులు. పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఎస్సైలు రవి కుమార్, రాజ్ కుమార్, తహశీయుద్దీన్తో పాటు ఇతర పోలీస్ సిబ్బందికి శాలువా కప్పి సన్మానించారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ విధించగా పోలీసులు నిబద్ధతగా విధులు నిర్వహించడం వల్లే వైరస్ వ్యాప్తి నియంత్రించగలుగుతున్నామని జాగృతి సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు గీతా చౌహన్, కార్యదర్శి నీతూ సర్కార్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రజల ముందుకు నిజాన్ని తీసుకొచ్చిన ఈనాడుకు అభినందనలు