ETV Bharat / state

పిడుగుపాటుకు పత్తిచేనులో మహిళా రైతు మృతి - rain updates

అప్పటి వరకు కుటుంబమంతా కలిసి పత్తి చేనులో మందు చల్లుతూ సరదాగా పని చేశారు. ఒక్కసారిగా పడిన పిడుగుకు కుటుంబంలోని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బెన మండలంలో జరిగింది.

women farmer died with  Thunderbolt in kumuram bheem district

author img

By

Published : Jul 28, 2020, 7:23 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో విషాదం చోటుచేసుకుంది. అమీన్​గూడకు చెందిన ఓ వ్యవసాయ కుటుంబం తమ సొంత పత్తి చేనులో కుటుంబ సభ్యులతో కలిసి యూరియా మందు వేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ప్రమాదంలో మొగిలి సావిత్రి అక్కడికక్కడే మృతిచెందింది.

పిడుగు పాటుకు తాళి బొట్టు, గాజులు చెల్లాచెదురుగా పడిపోయాయి. అప్పటి వరకు కుటుంబసభ్యులతో పని చేసిన సావిత్రి ఒక్కసారిగా విగతజీవిగా మారటం వల్ల విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని గ్రామస్థులు కోరారు.

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.