ETV Bharat / state

అటవీ శాఖ అధికారిణిపై తెరాస నేత దాడి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారిణి అనితపై జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు నేతృత్వంలోని కొంతమంది కర్రలతో దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణమైన కోనేరు కృష్ణారావు రాజీనామా చేశారు.

అటవీ శాఖ అధికారిణిపై తెరాస నేత దాడి
author img

By

Published : Jun 30, 2019, 7:33 PM IST

Updated : Jun 30, 2019, 8:33 PM IST

అటవీ శాఖ అధికారిణిపై తెరాస నేత దాడి

కుముంరం భీం అసిఫాబాద్ జిల్లాలో ఉద్రికత ఏర్పడింది. కాగజ్​నగర్ మండలం కొత్త సారసాల శివారులో 20 హెక్టార్ల భూమి విషయమై కొంతకాలంగా అటవీశాఖకు... స్థానిక రైతుల మధ్య వివాదం సాగుతోంది. తాము సాగు చేసుకుంటున్న పోడుభూములకు పట్టాలు ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తుంటే.. ఆ భూమి ఖాళీ చేయాలనీ అటవీశాఖ స్పష్టం చేస్తోంది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన భూములకు బదులుగా కొత్త సారసాలలోని పోడు భూముల్లో.. మొక్కలు నాటాలని అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ విషయంపై గ్రామస్థులకు సమాచారం ఇచ్చిన అటవీశాఖ.... నేడు ఎఫ్​ఆర్​ఓ అనిత నేతృత్వంలో సిబ్బంది చదును చేసేందుకు ట్రాక్టర్లతో ఆ భూముల్లోకి వెళ్లారు.

రెచ్చిపోయిన అనుచరులు:

ఆ సమయంలో స్థానికులు అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగితే వారికి నచ్చచెప్పేందుకు యత్నించారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణారావుతోపాటు ఆయన అనుచరులు, మరికొందరు స్థానికులు అటవీశాఖ అధికారులను అఢ్డుకున్నారు. విధులకు ఆటంకం కలిగించిన వారిని పోలీసులు జీపులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో స్వయంగా కృష్ణారావు కర్రతో ట్రాక్టర్​పై దాడి చేయడంతో ఆయన అనుచరులు మరింతగా రెచ్చిపోయారు. అనుచరుల్లో ఒకరు అధికారిణి అనితపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.

కృష్ణారావు నేతృత్వంలోనే దాడి:

దాడిలో తీవ్రంగా గాయపడిన అటవీశాఖ అధికారిణి అనితను కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘర్షణలో గాయపడిన వినోద అనే మహిళా రైతుని అదే అస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఘటనపై కాగజ్‌నగర్ డీఎఫ్​ఓ రాజారమణ రెడ్డి ప్రభుత్వానికి సమాచారం చేరవేశారు. జడ్పీ వైస్‌చైర్మన్ కృష్ణారావు నేతృత్వంలో దాడిచేశారని రాజారమణ రెడ్డి వెల్లడించారు.

పలు సెక్షన్ల కింద కేసులు:

అటవీ శాఖ అధికారిణి అనితపై స్థానికులు చేసిన దాడిని ఐఎఫ్​ఎస్​ అధికారులు తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న వారిని అడ్డుకోవటం, మహిళా అధికారిణి అని చూడకుండా గాయపరచటం సరికాదని ఐఎఫ్​ఎస్​ అధికారుల సంఘం పేర్కొంది. దాడికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. కోనేరు కృష్ణారావు, అతని అనుచరుడు బూర పోషంను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ప్రభుత్వ విధులకు ఆటంకం కల్గించడం, హత్యాయత్నం, వాహనాల ధ్వంసం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

జడ్పీటీసీ, జడ్పీ వైస్‌ఛైర్మన్ పదవికి కోనేరు కృష్ణారావు రాజీనామా చేసినట్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రకటించారు. ఈ మేరకు కృష్ణారావు రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు ఇచ్చినట్లు కోనప్ప వివరించారు.

కఠిన చర్యలు తప్పవు:

మరోవైపు అటవీశాఖ అధికారిణిపై దాడిని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఖండించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ... ఇలా దాడులు చేయెద్దని సూచించారు. అటవీ శాఖ సిబ్బందిపై ఎవరు దాడులు చేసినా సహించేది లేదని హెచ్చరించారు.

దాడిని ఖండించిన కేటీఆర్​:

దాడి ఘటనపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందించారు. కోనేరు కృష్ణారావు చేసిన పనిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. కృష్ణారావుపై ఇప్పటికే కేసు నమోదైందని... అరెస్టు చేశామని వివరణ ఇచ్చారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: అటవీశాఖ అధికారిణిపై దాడిని ఖండించిన కేటీఆర్​

Intro:ఐదో విడత హరితహారానికి చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 50 లక్షలకు పైగా మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. అత్యధిక భాగం మైదాన ప్రాంతమైన చొప్పదండి నియోజకవర్గం లో 50 లక్షల మొక్కలు యాభై శాతం పెరిగినా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుని వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. గత నాలుగు విడతల్లో నాటిన మొక్కలు వర్షాభావం, నీటి కొరత మూలంగా తక్కువ సంఖ్యలో పెరిగాయి. లక్షల సంఖ్యలో నాటిన మొక్కలు వేలల్లో మిగిలాయి. ఐదో విడత హరితహారంలో మాత్రం మొక్కలు నాటే స్థలాలను ముందుగానే గుర్తించి పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, మల్యాల, బోయినపల్లి మండలాల్లో అన్ని గ్రామాల్లో మొక్కలు అందుబాటులో ఉండడానికి స్థానికంగా నర్సరీలు ఏర్పాటు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు గ్రామాల్లో నర్సరీలకు తగిన ప్రోత్సాహం అందిస్తూ లక్షల సంఖ్యలో అన్ని రకాల మొక్కలను సిద్ధం చేయడానికి చర్యలు తీసుకున్నారు.

బైట్1
మల్లారపు శంకరయ్య, వెదిర నర్సరీ యజమాని

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
Last Updated : Jun 30, 2019, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.