ప్రభుత్వం గిరిజనులకు స్వయం ఉపాధిని కల్పించేందుకు గిరిజనులకు ఆర్థిక చేయూత పథకం (ఈఎస్‌ఎస్) తీసుకవచ్చింది.2017 సంవత్సరానికి కుమ్రంభీం జిల్లా వ్యాప్తంగా 676 మందికి ఈఎస్‌ఎస్ పథకం ద్వారా రూ.7.24 కోట్లు కేటాయించారు. 116 మందికి మాత్రమే రుణాలుగా రూ.1.08 కోట్లు విడుదల చేశారు. లభ్దిదారుల ఖాతాలో డబ్బు జమ కాలేదు. రెండేళ్లు గడిచినా గిరిజనులకు డబ్బులు అందక ఉపాధి ఆశలు అడియాశగానే మిగిలిపోయింది. అధికారులు, బ్యాంకులు, సంక్షేమశాఖ కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా ప్రయోజనంలేదని గిరిజనులు బాధను తెలుపుతున్నారు. అధికారులేమో ఎన్నికలకోడ్ అని, రాయితీలు రాలేదని తప్పించుకుంటున్నారని లభ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ రవాణా పథకం (ట్రైకార్) లో 41 మంది లబ్ధిదారులను గుర్తించి రెండేళ్లు దాటింది. వీరి వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల వరకు ఆయా బ్యాంకర్లు లబ్ధిదారుల వాటాల కింద జమ చేసుకున్నారు. .వారు మాత్రము ఈ పథకం ద్వారా డబ్బలు పొందలేదు. ఈ పథకం అమలుతీరేమో ఇలా ఉందని ఆదివాసిలు అంటున్నారు. కొందరు అప్పులు తెచ్చి మరి డిపాజిట్ చేసినా ఫలాలు అందడంలేదని, చివరకు అప్పులు, మిత్తిలే మిగులుతున్నాయని అడవి బిడ్డలు దిగులు చెందుతున్నారు.
ఇదీ చూడండి.'గో సంరక్షణ' పేరుతో మరో మూకదాడి