ETV Bharat / state

అమ్మో పులి... లోహలో ఆవుల మందపై దాడి - కుమురంభీం అడవుల్లో పులి దాడి

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. దహేగం మండలంలోని దిగడలో ఓ వ్యక్తిని హతమార్చిన ఘటన మరువక ముందే మరోసారి పులి పంజా విసిరింది. అదే మండలం లోహ అటవీ ప్రాంతంలో ఆవుల మందపై దాడి చేసింది.

tiger attack on Herd of cattle at loha in komaram bheem asifabad
అమ్మో పులి... లోహలో ఆవుల మందపై దాడి
author img

By

Published : Nov 22, 2020, 6:14 PM IST

కుమురం భీం జిల్లా దహేగం మండలం లోహ అటవీప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. అటవీప్రాంతంలో ఆవులమందపై దాడి చేసింది. లోహ అటవీ ప్రాంతంలో పశువులను కాస్తుండగా... ఆవుల మందపై పులి ఒక్కసారిగా దాడి చేసిందని పశువుల కాపరి గంగయ్య తెలిపారు.

ఈ దాడిలో లోహకు చెందిన మేడి చినబాబు ఆవు మృతి చెందింది. మరొక ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. పులిని చూసిన తాను చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నట్లు పశువుల కాపరి గంగయ్య తెలిపారు.

ఇదీ చదవండి: అలర్ట్:​ రెండు దశాబ్ధాల తర్వాత ఆ జిల్లాలో పులి గాండ్రింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.