కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం చిలాటి గూడ, సింగరావుపేట, ఈదులవాడ, కొమ్ముగూడ, బూరుగూడ గ్రామాల్లో మావోయిస్టులు తిరుగుతున్నారనే అనుమానంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా సుమారు 300 నుంచి 400 మంది పోలీసులు గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి చిలాటిగూడ గ్రామసమీపంలోని అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు, గ్రామాన్ని అణువణువు గాలిస్తూ తనిఖీలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికీ మావోయిస్టులు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు మాత్రం లభ్యం కాలేదు. పోలీసు యంత్రాంగం మాత్రం ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టక గోప్యత పాటిస్తున్నారు. భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ ఏం జరుగుతుందో అర్ధం కాక నిన్న రాత్రి నుంచి కాలాన్ని వెళ్లదీస్తున్నారు.
ఇవీ చూడండి: తమను పట్టించుకునే నాథుడే లేరు: కిడ్నీరోగులు