ETV Bharat / state

నోడల్ అధికారిగా సుధాకర్ నాయక్ నియామకం

author img

By

Published : Jul 31, 2020, 11:50 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కంటైన్​మెంట్ జోన్లకు వైద్యాధికారి సుధాకర్ నాయక్​ను నోడల్​ అధికారిగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

collector sandeep kumar jhaa
నోడల్ అధికారిగా సుధాకర్ నాయక్ నియామకం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలను జిల్లా అధికారులు కంటైన్​మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడికి ఎవరూ రాకుండా, అక్కడి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు నాలుగువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాలను కంటైన్​మెంట్ జోన్లుగా ప్రకటించినందున దుకాణాలు మూసి ఉంచాలని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. కంటైన్​మెంట్ జోన్​కు డిప్యూటీ వైద్యాధికారి సుధాకర్ నాయక్​ను నోడల్​ అధికారిగా నియమించామన్నారు.

జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో వంద పడకలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పైకాజీనగర్​లో ర్యాండమ్​గా నమూనాలు సేకరించాలని అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. వాంకిడి క్వారంటైన్​లో ఉన్న 26 మందిలో 17 మంది కోలుకున్నారని.... వారికి పరీక్షలు నిర్వహించి డిశ్ఛార్జీ చేయాలన్నారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో బోర్లు వేయాలని కలెక్టర్ అన్నారు. బావులు, నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి: ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.