ETV Bharat / sports

బుమ్రా @ 400 వికెట్లు - అరుదైన ఫీట్ అందుకున్న స్టార్ బౌలర్ - Ind vs Ban Test Series 2024

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Updated : 1 hours ago

Bumrah 400 Wickets : బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా పేసర్ బుమ్రా అరుదైన మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​లో మూడు ఫార్మాట్​లలో కలిపి 400 వికెట్లు పూర్తి చేశాడు.

Ind vs Ban Test
Ind vs Ban Test (Source : Associated Press)

Bumrah 400 Wickets : బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్​లో నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలోనే బుమ్రా అరుదైన మైలురాయి అందుకున్నాడు. బుమ్రా అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్​లో 36.5వ ఓవర్ వద్ద హసన్ అహ్మద్ వికెట్​తో బుమ్రా ఈ ఫీట్ అందుకున్నాడు. కాగా , ఈ ఫీట్ సాధించిన 6వ టీమ్ఇండియా పేసర్​గా నిలిచాడు. ఈ లిస్ట్​లో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ 687 వికెట్లతో టాప్​లో ఉన్నాడు. ఇక ఓవరాల్​గా భారత్​ నుంచి 400+ వికెట్లు తీసిన 10వ బౌలర్​గానూ బుమ్రా నిలిచాడు.

బుమ్రా కంటే ముందు 400 అంతర్జాతీయ వికెట్లు తీసిన భారత పేసర్లు :

  • కపిల్ దేవ్- 687 వికెట్లు
  • జహీర్ ఖాన్- 597 వికెట్లు
  • జవగల్ శ్రీనాథ్- 551 వికెట్లు
  • మహ్మద్ షమీ- 448 వికెట్లు
  • ఇషాంత్ శర్మ- 434 వికెట్లు
  • జస్ప్రీత్ బుమ్రా-401 వికెట్లు

సూపర్ సక్సెస్ బౌలర్
2016లో అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేసిన బుమ్రా అప్పట్నుంచి టీమ్ఇండియాకు కీలకంగా మారాడు. మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీమ్ఇండియా చరిత్రలో నాణ్యమైన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. బుల్లెట్​లాంటి యార్కర్లు, టెక్నిక్​తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అయితే పరుగుల కట్టడి చేస్తూ వికెట్ల తీయడంలో దిట్ట అని చెప్పొచ్చు. ఇక ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 196 మ్యాచ్​ల్లో 401* వికెట్లు పడగొట్టాడు. అందులో టెస్టు (163), వన్డే (149), టీ20 (89) ఉన్నాయి. కాగా, వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు, టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన రికార్డు బుమ్రా పేరిటే ఉంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఫస్ట్ ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 376 పరుగులకు ఆలౌట్ కాగా, బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్​ ముగిసేసరికి భారత్​కు 227 పరుగుల ఆధిక్యం లభించింది.

బుమ్రా, సిరాజ్ అదుర్స్ - 149 పరుగులకే బంగ్లా ఆలౌట్ - IND vs BAN Test 2024

ఈ తరానికి 'బుమ్రా' ఒక్కడే- ప్రపంచ క్రికెట్​లోనే టాప్ ప్లేయర్ - Ravichandran Ashwin On Bumrah

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.