ETV Bharat / state

కాగజ్​నగర్​లో బాలారిష్టాలు ఎదుర్కొంటున్న పీఎం స్వానిధి పథకం - street vendor loan problems in kagaznagar y not providing information in pm swanidhi

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ పురపాలికలో ఇప్పటివరకు 1,200 మంది వీధి వ్యాపారులుండగా... వారిలో 968 మందిని పీఎం స్వానిధి పథకం గుర్తించారు. వీధి వ్యాపారులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో కేవలం 52 మంది వివరాలు మాత్రమే ఆన్​లైన్​లో నమోదు చేశారు.

street vendor loan problems in kagaznagar y not providing information in pm swanidhi
బాలారిష్టాలు ఎదుర్కొంటున్న పీఎం స్వానిధి పథకం
author img

By

Published : Jul 23, 2020, 4:57 PM IST

లాక్​డౌన్​లో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం స్వానిధి పథకం బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. పురపాలక సంఘాలు.. అర్హులను గుర్తించి దరఖాస్తులను స్వీకరించి ఆన్​లైన్​లో నమోదు చేయాలి. కానీ ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ పురపాలికలో ఇప్పటివరకు 1,200 మంది వీధి వ్యాపారులుండగా... వారిలో 968 మందిని గుర్తించారు. అందులో కేవలం 52 మంది వివరాలు మాత్రమే ఆన్​లైన్​లో నమోదు చేశారు.

గుర్తింపు పొందిన వీధి వ్యాపారుల వివరాలను ఆన్​లైన్​లో పొందుపరచడం, పత్రాలు జారీ చేయడం, రుణాలు ఇప్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వీధి వ్యాపారులు తెలిపారు. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో.. తమకు రుణం ఎప్పుడు వస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం ప్రభుత్వం పథకం పేరుతో యాప్​నూ విడుదల చేసింది. వ్యాపారులు దీన్ని డౌన్​లోడ్ చేసుకుని ఆన్​లైన్​ లావాదేవీలు నిర్వహిస్తే ప్రతి నెల రూ. వంద క్యాష్ బ్యాక్ వస్తుందని తెలిపింది.

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.