కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వట్టివాగు రోడ్డుపై వెళ్తున్న పత్తి లారీకి విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. సుమారు పత్తి 20 క్వింటాళ్ళ పత్తికి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటలు చెలరేగడం వల్ల డ్రైవర్ అప్రమత్తమై లారీని కొంత దూరం ముందుకు తీసుకెళ్లి ఆపాడు.
స్థానికుల సాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. అప్పటికే కొంత పత్తి కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఇదీ చూడండి : రేవంత్ రెడ్డి అరెస్టును పార్లమెంటులో ప్రస్తావించిన తమిళనాడు ఎంపీ