కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణం 2వ వార్డులో తమ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపిస్తూ పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. పట్టణంలోని 2వ వార్డులో పల్లె ఎల్లగౌడ్కు చెందిన స్థలాన్ని తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు కబ్జా చేసుకుని నిర్మాణం చేపట్టారంటూ ఆరోపించారు. ఎల్లగౌడ్ ఈ స్థలాన్ని గతంలో ఒకరికి లీజుకు ఇచ్చారని అతని కోడలు సరిత తెలిపింది. ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న వ్యక్తి సొంత స్థలంగా తప్పుడు పత్రాలు సృష్టించి మరొకరికి అమ్ముకున్నారని వివరించింది.
గతంలో ఆ స్థలం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఉన్నట్లు తెలియగా.. వివరాల కోసం అధికారులకు అర్జీ చేశామని సంబంధిత మహిళలు పేర్కొన్నారు. తమ పూర్వీకుల పేరుతో స్థలం ఉన్నట్లు రికార్డుల్లో బయటపడిందని వెల్లడించారు. తప్పుడు పత్రాలతో నిర్మాణం చేపట్టారని.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని పురపాలక అధికారులకు ఆదేశాలు జారీ అయినా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ లేదని జరిమానా