కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు నుంచి ఈ నెల 27 వరకు వివిధ విభాగాలకు సంబంధించి జరగాల్సిన సదరం శిబిరాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకట శైలేష్ తెలిపారు. కొవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఐదు సదరం శిబిరాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు.
మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు విషయాన్ని గమనించాలని సూచించారు. తదుపరి శిబిరాలు నిర్వహించే తేదీలను ప్రకటిస్తామన్నారు.
ఇవీ చూడండి: రేపు గ్రేటర్లో మరో 25 బస్తీ దవాఖానాలు ప్రారంభం