ETV Bharat / state

అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్​ అన్నం.. గ్రామస్థుల ఆందోళన

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని ఓ గ్రామంలో ప్లాస్టిక్ అన్నం కలకలం రేపింది. ఓ అన్నదాన కార్యక్రమంలో వడ్డించిన అన్నం.. ప్లాస్టిక్​దని తేలడంతో గ్రామస్థులు విక్రయించిన వ్యాపారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తినే ఆహారాన్ని సైతం కల్తీ చేస్తున్న ముఠాలను పట్టుకుని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

plastic-rice-in-a-charity-event-in-kumurambheem-district
అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్​ అన్నం.. గ్రామస్థుల ఆందోళన
author img

By

Published : Feb 28, 2021, 5:49 PM IST

Updated : Feb 28, 2021, 6:32 PM IST

అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్​ అన్నం.. గ్రామస్థుల ఆందోళన

కుమురం భీం ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలో పులాజి బాబా వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్థులంతా పాల్గొని భోజనాలు చేస్తుండగా.. పలువురు చిన్న పిల్లలు ఆ ఆహారాన్ని తినడానికి ఇబ్బందిపడ్డారు. ఇది గమనించిన పెద్దలు.. అనుమానంతో అన్నాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. మంటలో వేసి చూడగా ప్లాస్టిక్​గా కాలిపోయింది. దీంతో ప్లాస్టిక్​ బియ్యంగా స్థానికులు నిర్థరించారు.

గ్రామస్థులంతా కలిసి బియ్యం కొనుగోలు చేసిన దుకాణం ఎదుట బైఠాయించారు. యజమాని వచ్చి సమాధానం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుకాణ యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

బియ్యం, ఇతర ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న ఇలాంటి ముఠాలను పట్టుకోవాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఇదీ చూడండి: ఉద్యోగాల విషయంలో తెరాసకు చిత్తశుద్ధి లేదు: ఉత్తమ్​

Last Updated : Feb 28, 2021, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.