కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పిట్టగూడా గ్రామస్థులు అటవీ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో 11మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కలప స్మగ్లింగ్‌ను అడ్డుకున్నందుకు దాడి చేసినట్టు ఎస్సై వెంకటేష్ తెలిపారు. గ్రామ సర్పంచ్‌ని ఏ2 నిందితుడిగా చేర్చినట్టు ఎస్సై చెప్పారు. లాక్డౌన్ తర్వాత నిందితులను రిమాండ్‌కు పంపుతామని వివరించారు.
పిట్టగూడకు చెందిన రమేష్ అనే వ్యక్తి అక్రమంగా కలప తరలిస్తున్నారనే సమాచారంతో రాత్రి 8 గంటలకు బీట్ అధికారి సునీల్ అక్కడికి వెళ్లారు. కలపను స్వాధీనం చేసుకొని లింగాపూర్‌కు తీసుకెళ్తుండగా గ్రామస్థులు అడ్డుకొని కర్రలు, రాళ్లతో దాడి చేసినట్టు బీట్ అధికారులు ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి రావొద్దని సర్పంచ్ దస్రు బెదిరించినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి: నేడు డిశ్చార్జి కానున్న 128 మంది కరోనా బాధితులు