సిర్పూర్ నియోజకవర్గంలోని దహేగాం, చింతలమానేపల్లి మండలాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు పర్యటించారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బాపురావుకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా పలు గ్రామాల్లో రహదారి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
"ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 860 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకు ప్రణాళిక రూపొందించి కేంద్రానికి నివేదించాం. ప్రస్తుతం 3.5 కోట్లు దహేగాం, చింతలమానేపల్లి మండలాల్లో రహదారులకు మంజూరు అయ్యాయి. రాష్ట్రంలో కేంద్ర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆ ఘనతను తెరాస నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు."
-సోయం బాపురావు, ఎంపీ
రానున్న రోజుల్లో అభివృద్ధి పనులకు మరో 300 కోట్ల నిధులు మంజూరవనున్నట్లు ఎంపీ సోయం తెలిపారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్, సిర్పూర్ నియోజకవర్గం ఇంఛార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: చౌదరి బస్తీలో ఇంటింటికీ తలసాని.. రూ.10 వేల ఆర్థిక సాయం