ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థుల కోసం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి, ఐటీడీఏ పీవో ఆదిత్య, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు హాజరయ్యారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఇదీ చదవండిః గుడ్డు కావాలీ... మధ్యాహ్న భోజనంలో "గుడ్డు గుటుక్కు"!