కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో వీధి వ్యాపారులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెక్కులు పంపిణీ చేశారు. ప్రధాన మంత్రి స్వనిధి పథకంలో భాగంగా మంజూరైన రుణాల చెక్కులను ఎమ్మెల్యే లబ్దిదారులకు అందించారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తూ.. రుణాలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 1600 మంది రుణాలకు దరఖాస్తు చేసుకోగా.. 282 మందికి రుణాలు మంజూరయ్యాయి. దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి త్వరలోనే రుణాలు మంజూరవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, కమిషనర్ శ్రీనివాస్, మెప్మా అధికారులు, పలువురు కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి
వీధి వ్యాపారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కరోనా వల్ల లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకంలో భాగంగా మంజూరైన రుణాల చెక్కులను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పంపిణీ చేశారు. కాగజ్ నగర్ పురపాలక సంఘం కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంచిన ఎమ్మెల్యే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.