కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కాగజ్నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల పూర్తి వివరాలు సేకరించి స్టాంప్ వేస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే మెడికల్ క్యాంపులో రాపిడ్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పాజిటివ్ కేసులు వస్తే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి రోగులను వాంకిడి ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. రైల్వే స్టేషన్లో రైలు వచ్చిన ప్రతిసారి సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేస్తున్నారు. కాగజ్నగర్ పురపాలక కమిషనర్ శ్రీనివాస్ కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తీర్పు రిజర్వ్ చేసిన ఎన్జీటీ