కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 14న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ వెల్లడించారు. కక్షిదారులు రాజీమార్గంలో కేసుల పరిష్కారించుకోవాలని ఆమె సూచించారు. కుటుంబ తగాదాలు, క్రిమినల్, బ్యాంకు లావాదేవీల సంబంధిత కేసులు, ఇతరత్రా సమస్యల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ మంచి వేదికని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: 'న్యాయవాదికి బెదిరింపులా.. ఇలా జరగాల్సింది కాదు'