కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
మరోవైపు వాంకిడి మండలంలో భాజపా నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల చర్య పట్ల నాయకులు అసహనం వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఇదీచూడండి.. ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు