నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని తిర్యాని జడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి సిడాం జగన్నాథరావు తెలిపారు. మెుదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. తనను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారంటూ తన భార్యపై కొందరు అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తెచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారని చెప్పారు. తమ పార్టీ నాయకులే తనను ఎందుకు కిడ్నాప్ చేస్తారని ప్రశ్నించారు. ఏకగ్రీవం కోసం తెరాస నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల ఇలా కిడ్నాప్ నాటకమాడుతున్నారని విమర్శించారు.
ఇవీ చూడండి: చిరంజీవి ఫాంహౌస్లో అగ్ని ప్రమాదం.. మంటల్లో సైరా సెట్