అన్ని అవయవాలు సవ్యంగా ఉండి కూడా ఓటు వేయడానికి బద్ధకించే వారుంటారు. రెండు చేతులు లేకపోయినా... ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో తనవంతు పాత్రగా ఓటేశాడు ఓ యువకుడు.
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణానికి చెందిన జకీర్ పాషాకు రెండు చేతులు లేవు. అయినా వైకల్యాన్ని లెక్క చేయకుండా ఓటింగ్లో పాల్గొని ఆదర్శంగా నిలిచాడు. కాలితో ఓటేసి తన బాధ్యతను నిర్వర్తించాడు. మిగతా వారికి గుర్తు చేశాడు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 62.25 శాతం పోలింగ్ నమోదు: ఈసీ