కొమురంభీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో కరోనా మహమ్మారిపై సీఐ హనూక్ అవగాహన కల్పించారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. వైరస్‌పై అవగాహనలో భాగంగా హెడ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రోడ్డుపైన కరోనా బొమ్మ వేశారు. లాక్డౌన్ వేళ అనవసరంగా బయటికి వచ్చే ప్రజలు కనీసం బొమ్మను చూసైనా... మహమ్మారి గురించి ఆలోచిస్తారని, అనవసరంగా బయట తిరగరని అన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఐ హనూక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ రావు, ఎస్ఐ తిరుపతి, శిక్షణ ఎస్సైలు రామకృష్ణ, హెడ్ సొసైటీ అధ్యక్షుడు శ్రీకాంత్, పవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా