కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ జంట ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుని జీవనం సాగిస్తోంది. ప్రతిరోజు ద్విచక్రవాహనంపై వెళ్లి సంచుల్లో వ్యర్థాలు తీసుకుని ఇంటికి పయనమవుతారు. అలా తిరుగు ప్రయాణంలో ప్రమాదకరంగా వెళ్తున్న ఈ జంట దృశ్యాలు ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి.
వ్యర్థాల సంచులు భారీగా ఉండటం వల్ల వాహనం వెనక పెట్టామని, తన భార్య కూర్చోవడానికి స్థలం లేక పెట్రోల్ ట్యాంక్పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాని ఆ వ్యక్తి తెలిపారు. ప్రమాదమని తెలిసినా వేరే గతి లేక ఇలా చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వం దయతలిచి తమ జీవనానికి తోడ్పడాలని కోరారు.
- ఇదీ చూడండి : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... పలువురిపై కేసులు