కుమురం భీం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది పొంగిపొర్లుతోంది. ప్రాణహిత వరద నీరు బెజ్జూర్ మండలంలోని పాపంపేట, తలాయి రోడ్లపై ప్రవహించడంతో పాటు గ్రామాల చుట్టూ చేరింది. మండలంలోని పలు గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. ప్రజలు అత్యవసర పరిస్థితిలో కూడా మండల కేంద్రానికి రాలేని పరిస్థితి నెలకొంది. తలాయి, తిక్కపల్లి, భీమారం, నాగపల్లి తదితర గ్రామాల రైతులు సాగుచేసిన వేల ఎకరాల పంట నీట మునిగింది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: నమ్మకంగా పనిచేస్తునట్టు నటించి రూ.80లక్షలు కాజేశాడు