కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలో విషాదం చోటు చేసుకుంది. బర్కత్ సబ్రికి ముగ్గురు కుమారులు కాగా.... రెండో కొడుకైన జమర్ సబ్రి ఇంటి ముందు ఆడుకుంటూ ఆవరణలోని నీటి ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ జారీ పడ్డాడు. ఆడుకుంటున్న చిన్నారి కన్పించటం లేదని తల్లిదండ్రులు వెతకగా నీటి సంపులో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే సామాజిక ఆసుపత్రికి తరలించగా... అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. అక్కడి నుంచి కాగజ్‌నగర్‌కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. అప్పటి వరకు బడిబుడి అడుగులతో కళ్లముందరే తిరిగిన కుమారుడు కానరానిలోకాలకు వెళ్లటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చూడండి: గర్భవతిని చేసి.. మందుల చీటిపై వీలునామా రాసిన డాక్టర్