కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల రైతులు వారం రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. కాగజ్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 340 టన్నుల యూరియా సరఫరా అయింది. పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా రైతులకు ఒక్కొక్కరికి 5 బస్తాల చొప్పున పంపిణీ చేశారు. తీసుకున్న వారే మళ్లీ తీసుకుంటున్నారని, తమకు మాత్రం ఎప్పుడు వచ్చినా ఎరువు దొరకడం లేదని కొంతమంది కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : 30రోజుల ప్రణాళికతో "పల్లె" ప్రగతి మారుతుంది