కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలో ఆబ్కారీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ. 50వేల విలువ గల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పెంచికలపేట మండలంలో పలు చోట్ల అక్రమ మద్యం నిల్వలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు.
డబ్బుల రంగయ్య, చంద్రశేఖర్ వద్ద 345 మద్యం సీసాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం నమోదైన మధ్యప్రదేశ్ మద్యం కేసులో ఆబ్కారీ శాఖపై కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి హరీశ్‌బాబు చేసిన ఆరోపణలను అధికారులు ఖండించారు.